ములుగు అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా సీతక్క గెలుపు మరో మారు ఖాయం అని మెహబూబాబాద్ పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్ పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన మహిళ సంధ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల మహిళా అధ్యక్షురాలు మద్దాల నాగమణి ఆధ్వర్యంలో సీతక్క గెలుపుకై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రతిక్షణం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్న సీతక్క ను ప్రజలు మర్చిపోరని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు సీతక్క చేసిన సేవలు ప్రజల మనసులో చిరస్థాయిగా గుర్తుండిపోయాయని అన్నారు. ప్రజల మనిషి సీతక్కను అసెంబ్లీకి పంపాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని 50 వేల ఓట్ల మెజారిటీతో సీతక్క గెలుపు ఖాయమని అన్నారు. అనంతరం సీతక్క గెలుపును ఆకాంక్షిస్తూ మండల కేంద్రంలోని గోవిందరాజుల స్వామి ఆలయం లో కాంగ్రెస్ పార్టీ,జిల్లా కార్యదర్శి సూది రెడ్డి జయమ్మ ఆధ్వర్యంలో ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి లు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మహిళా కార్య కర్త లతో ఇంటింటికీ తిరుగుతూ సీతక్క కు ఓటు వేసి గెలిపించాలని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పథకాలు వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం చేశారు , ఈ కార్యక్రమంలో మని, వజ్ర మ్మ, ప్రమీల, లక్ష్మి, సాంబలత, సునిత వసంత, సుభాషిణి నాగమణి, ఉపేంద్ర ఆలియా, మెరిల్ల, వందలాది మహిళా కార్య కర్తలు పాల్గొన్నారు.