
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండా లో మంగళవారం సీత్లా భవాని పండుగను ఘనంగా నిర్వహించారు. అనంతరం గిరిజనులు మాట్లాడుతూ.. సీత్లా భవాని పండుగను ప్రతి ఏటా బంజారాలు జరుపుకునే పండుగ సీత్లా భవాని పండుగ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పశువుల్లో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి నైవేద్యం సమర్పించి సీత్లా భవాని పండుగను నిర్వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గిరిజన తండావాసులు పాల్గొన్నారు.