హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సెహ్వాగ్‌

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సెహ్వాగ్‌దుబాయ్ : ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో భారత మాజీ క్రికెటర్లు వీరెందర్‌ సెహ్వాగ్‌, డయాన ఎదుల్జీ సహా శ్రీలంక స్టార్‌ అరవింద డిసిల్వకు చోటు దక్కింది. టీ20 ఫార్మాట్‌కు బీజం పడుతున్న దశలోనే వన్డేల్లో 100కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగుల వరద పారించిన వీరెందర్‌ సెహ్వాగ్‌ ధనాధన్‌కు శ్రీకారం చుట్టాడు. భారత మహిళల క్రికెట్‌ను 70, 80వ దశకంలో నడిపించిన డయాన ఎదుల్జీ.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు వర్థమాన మహిళలకు ప్రేరణగా నిలిచింది. 1996 ప్రపంచకప్‌ విజేత, సచిన్‌తో సమానంగా ఆరు ప్రపంచకప్‌ల్లో పోటీపడిన అరవింద డిసిల్వ శ్రీలంక క్రికెట్‌ దిగ్గజంగా ఎదిగాడు.