ప్రైవేటు స్కూల్ బస్సులు సీజ్..

– జిల్లా రవాణా అధికారి యాస సురేందర్ రెడ్డి
నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
చౌటుప్పల్ పట్టణంలో 7 ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేశామని యాదాద్రిభువనగిరి జిల్లా రవాణా అధికారి యాస సురేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. సురేందర్ రెడ్డి చౌటుప్పల్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్ యజమాన్యాలు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని సూచించారు. కాలం చెల్లిన 3 బస్సులు,4 బస్సులకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, లైసెన్స్ లు సరిగా లేవని తెలిపారు. తనిఖీలలో భాగంగా మొత్తం ఏడు బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసి భువనగిరికి తరలించామని జిల్లా రవాణా అధికారి యాస సురేందర్ రెడ్డి తెలిపారు