– చేసిన వెహికల్ ఇన్స్పెక్టర్ కంచు వేణు
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర శనివారం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు వేకిల్ చెక్ చేస్తుండగా, ఏలాంటి కాగితాలు లేకుండా డిపిఎల్ సంస్థకు సంబంధించిన ఏడు టిప్పర్లు మొరం ఓవర్ లోడుతో నడుపుతున్న మట్టి టిప్పర్లను పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టి అనంతరం హుజురాబాద్ ఆర్టీసీ డిపోకు పంపించినట్లు, హుజురాబాద్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటార్ వెహికల్ చట్టం యాక్ట్ ప్రకారం ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.