
పట్టణ కేంద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకొని వారి నుండి 21 వేల200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేయగా భీంగల్ పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన చెందిన రమావత్ తుక్కాజి , బాపూజీ నగర్ కాలనీకి చెందిన బషారత్, భీంగల్ మండలంలోని పురానిపేట్ ,బాబా పూర్ గ్రామాలకు చెందిన తోట రాజశేఖర్, కదం అర్జున్, మోత్కూరు బాబురావు గౌడ్, సిరికొండ మండలం పోతునూరు, కొండూరు గ్రామాలకు జమ్మలింగం, మల్కాయి సదానంద్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు