నవతెలంగాణ-హాయత్ నగర్:
ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన తర్వాత పోలీసులు చేపడుతున్న వాహనాల తనిఖీల్లో భాగంగా హాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి హై వే బావర్చ్ ఎదురుగా పోలీసులు చేస్తున్న వాహనాల తనిఖీల్లో లింగా రెడ్డి అనే వ్యక్తి నుండి 5,56,900నగదు పట్టుబడింది. అదేవిధంగా హాయత్ నగర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాలనీ వద్ద వాహనాల తనిఖీల్లో సొంటి బాలకృష్ణ నుండి 56,250 నగదు పట్టుబడిందని కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.