నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆర్టీసీ డిపో వద్ద గంజాయిని పట్టుకున్నట్లు నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనోజ్ శుక్రవారం తెలిపారు. నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగో టౌన్ పరిధిలోని ఆర్టీసీ-2 డిపో వద్ద గురువారం రాత్రి పోలీసులు గస్తీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.