ఎన్నికల కోడ్ సందర్భంగా సోమవారం మున్సిపల్ పరిధిలోని అంగడిపేట గ్రామ శివారులోని బీఆర్ సీ ఫంక్షన్ హాల్ వద్ద ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇడికుడ గ్రామం వైపు నుండి బైక్ దారుడిని తనిఖీ చేయగ నల్ల అశోక్ వద్ద రూ.2,20,000 /- ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తునందున, డబ్బులను సీజ్ చేసి ఆ నగదును తదుపరి విచారణ నిమిత్తం జిల్లా ట్రెజరీ ఆఫీసు లో భద్రపరిచినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు,వ్యాపారస్తులు, రూ.50 నగదు కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బును వెంట తీసుకువెళ్లరాదని, ఒకవేళ ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకువెళ్లాలంటే ఆ డబ్బుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.