
– రూ.15 వేలు జరిమాన
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని తహసిల్ కార్యాలయానికి తరలించామని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రమ ఇసుక రవాణ ట్రాక్టర్లపై రూ.15 వేలు జరిమాన విధించామని తహసీల్దార్ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘించి ఇసుక రవాణ సాగిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని తహసీల్దార్ హెచ్చరించారు.