అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం పట్టిక పట్టివేత

నవతెలంగాణ- అచ్చంపేట: ప్రభుత్వం నిషేధించిన నాకు సారకు ఉపయోగించే నల్ల బెల్లం మత్తు పదార్థం పట్టిక అక్రమంగా తరలిస్తుండగా సిద్దాపూర్ పోలీసులు పట్టుకున్నారు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపిన వరాల ప్రకారం. ఆదివారం ఉదయం తెల్లవారుజామున 02-00 గంటలకు దేవరకొండ నుండి అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా అశోక్ లేలాండ్ TS 05 UD 7630 గల వాహనంలో తరలిస్తున్న నల్లబెల్లం 1470. కిలోలు,  పట్టిక 45 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత నల్ల బెల్లం, పటికను తరలిస్తున్న  నల్గొండ జిల్లా, కొండ మల్లేపల్లి మండలం,   అడిసర్లపల్లి గ్రామానికి చెందిన సంపంగి రాములు పై కేసు నమోదు చేసినట్లు సిద్దాపూర్ ఎస్ఐ తెలిపారు.