నవతెలంగాణ – నారాయణపేట
నారాయణపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త దాడులలో మంగళవారం రూ.6,67,075ల విలువజేసే అంబర్, జర్థ, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు.జిల్లా కేంద్రంలో నారా యణపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీ సు లు, సంయుక్తంగా పలు కిరాణా షాపులలో దాడులు నిర్వహించి అంబర్, జర్ధ, గుట్కా ప్యాకె ట్లను, పాన్ మసాలా, పొగాకు జర్ధా కలిపి అమ్ముతున్నరన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి పట్టు కున్నారు.
పట్టుబడ్డ వారి వివరాలు…
అశోక్ పసారి కిరాణం గోదాంలో రు.6,44,865 విలువ గల గుట్కా పట్టివేత. కే.వెంక ట్రాములు కృష్ణయ్య కు చెందిన కృష్ణ కిరణ షాపులో రు.13,090 విలువ గల గుట్కా పట్టివేత. నజీర్ అహ్మద్ తండ్రి అబ్దుల్‌కు చెందిన కిరాణ షాపులో రు. 9120 విలువగల గుట్కాలు, విమల్, టొబాకో పోలీ సులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నారా యణపేటఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత అంబర్, జర్ద, గుట్కా ప్యాకెట్లను అక్రమంగా కిరాణంలో నిల్వఉంచి ప్రజలకు అమ్ముతున్నందున ఎస్‌ఐ పంచనామా అనంతరం సీఐ శివ శంకర్ ఆదేశాల మేరకు.. ముగ్గురు వ్యక్తులపై కేసులు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అంబర్ జార్ధ, గుట్కా లను నిషేధించినందున వాటిని ఎవరు కూడా రవాణా చేయడం గాని, నిల్వ ఉంచడం గాని, ప్రజలకు అమ్మడం గాని చేయరాదని పేర్కొన్నారు. అలా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఎస్‌ఐ హెచ్చరించారు.