అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ స్వాధీనం

నవతెలంగాణ-గోవిందరావుపేట : అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని తనిఖీ స్వాధీనం చేసుకున్నట్లు సిఐసిసిఎస్ దయాకర్ రావు తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు సిసిఎస్ దయాకర్ రావు ఆధ్వర్యంలో పసర పోలీసులు సమన్వయంతో డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రేషన్ రైస్ పట్టుకోవడం జరిగింది. సిసిఎస్ దయాకర్ రావు కదనం ప్రకారం పస్రా సర్కిల్ నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా  వెళుతున్న డీసీఎం నెంబర్ టీఎస్12 యూఏ 1114 డీసీఎం వాహనాన్ని  ఆపి తనిఖీ చేసి అందులోని వ్యక్తులను  అదుపులోకి తీసుకొని విచారించగా డీసీఎం వాహనంలో లో  సుమారు 75 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ ఉన్నదని, లింగాల పరిసర ప్రాంతాల నుండి సేకరించిన పి డి ఎస్  బియ్యాన్ని ప్రజల వద్ద నుండి తక్కువ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి, ఒక్కసారిగా మహారాష్ట్ర కి తీసుకుని వెళ్లి , అక్కడ అమ్మితే ఎక్కువ మొత్తంలో లాభం వస్తుందనీ, అధిక లాభాలకు ఆశపడి ఈ విధంగా చేశామని ఒప్పుకోవడం జరిగింది.మహారాష్ట్ర కి వెళ్లే క్రమంలో పట్టుబడ్డామని నిందితులు తెలియజేయడం జరిగింది.ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని 75 క్వింటాళ్ల బియ్యం లోడ్ గల డీసీఎం ను స్వాధీన పర్చుకోవటం జరిగిందన్నారు.నిందితుల వివరములు.మాలోత్ తిరుపతి  మహముత్తరాం,  మొక్క సతీష్ నార్లాపూర్, బీద సుధాకర్ మహముత్తరాం గా  పేర్కొన్నారు. 75 గంటల పిడిఎస్ రైసు బియ్యం విలువ సుమారు 112,500 ఉంటుందని అన్నారు. ఎస్ ఐ ఎస్.కె మస్తాన్ మాట్లాడుతూ పేదలకు చెందాల్సిన ప్రభుత్వ బియ్యం ను అక్రమంగా నిల్వ చేసిన, తరలించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడుతాయి అని చెప్పటం జరిగింది.  ఈ తనిఖీలో సి ఐ సి సి ఎస్ దయాకర్ రావు, సి ఐ పస్రా శంకర్,ఎస్ ఐ పస్రా షైక్ మస్తాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.