రెంజల్ మండలం నీల గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై ఉదయకుమార్ తెలిపారు. ఉదయం పెట్రోలింగ్ చేస్తూ ఉండగా కోపర్గా గ్రామం నుంచి నీలవైపు వస్తున్న ఈ ట్రాక్టర్లను పట్టుకొని విచారించగా,వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని పోలీస్ స్టేషన్ తరలించమని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.