ఆధారాలు లేని నగదు స్వాధీనం 

నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎన్నికల నేపధ్యంలో  అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర బుధవారం ఎస్.హెచ్.ఒ శ్రీకాంత్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ఆధారాలు లేని రూ. 2,30,000 లు నగదును స్వాధీనం చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్,అల్లూరు సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలం, రాజంపేట కు చెందిన శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి దేవరపల్లి నుంచి భద్రాచలం వస్తున్నారు. మంగళవారం ఇద్దరి రూ.4,61,100 లు తో పాటు బుధవారం రూ.2,30,000 లు నగదుతో పాటు ఇప్పటి వరకు మొత్తం రూ.6,91,100 లు స్వాధీనం చేసుకున్నారు.