నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లో శనివారం తనిఖీలు చేస్తుండగా ఆధారాలు లేని నగదు లభ్యం అయినట్లు ఎస్.ఐ శ్రీకాంత్ తెలిపారు. కాకినాడ కు చెందిన కోలా తిరుమల రాజు అశ్వారావుపేట మీదుగా తన వాహనంలో వరంగల్ ప్రయాణిస్తుండగా తనిఖీల్లో ఆధారాలు లేని నగదును గమనించాం అని అన్నారు.