తిమ్మాపురం వాసి డిగ్రీ కళాశాలల కెమిస్ట్రీ లెక్చరర్ గా ఎంపిక

నవతెలంగాణ – చివ్వెంల
మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన గన్నేర్ల సైదాచారి  (స్టేట్  8th ర్యాంక్ ,పీహెచ్డీ  ఓయూ ) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ల  ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అతన్ని గురువారం ఘనంగా సన్మానించారు. చిన్నప్పటి నుంచి  కష్టపడి చదివి  ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే  లక్ష్యంతోకష్టపడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ గా ఎంపిక అవ్వడంతో అతన్ని గ్రామస్తులు బంధుమిత్రులు వారి నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఉన్న సమాజంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని ఎంతో కష్టపడి చదివితేనే ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలను ఎంపీ కావడం కష్టమని అన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీని సద్వినియోగం తీసుకున్నందుకు కష్టపడి చదివి ప్రభుత్వ కొలువులను సంపాదించుకోవాలని యువతను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటచారి, మధుసూదన్ రెడ్డి, లలిత్ కుమార్, సురేష్ ,సంజీవరెడ్డి ,నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు.