ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 9వ తరగతి విద్యార్థిని హారిక రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనాథం శుక్రవారం తెలిపారు. ఈనెల 14 ,15 తేదీలలో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని రమ్య గ్రౌండ్స్ లో జరిగే 43వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనబోతుందని వారన్నారు.ఈసందర్బంగా
క్రీడాకారునిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనాథం, ఉపాధ్యాయ బృందం, విడిసి సభ్యులు అభినందించారు.