నవతెలంగాణ-నకిరేకల్ : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి ఇంటర్ కాలేజ్ మీట్ వెస్టిలింగ్ లో జోన కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థి జీ మౌనిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. వెస్టిలింగ్ విభాగంలో ఆల్ ఇండియా యూనివర్సిటీకి అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. మౌనిక ఆల్ ఇండియా యూనివర్సిటీకి ఎంపిక కావడం పట్ల కళాశాల యాజమాన్యం అభినందించింది.