నవతెలంగాణ ఆర్మూర్: ఈ నెల 9 నుండి 13 వరకు శ్రీకాకుళం జిల్లా పలాస లో జరిగే సీనియర్ మహిళాలా టెన్ని కైట్ జాతీయ స్థాయి పోటీలకు నిజామాబాద్ క్రీడాకారిణిలు త్రిష, ప్రసజ్ఞ,నవనీత,ఉమారాని, ఎంపికయ్యారు అని జిల్లా సంఘం ప్రతినిధులు మల్లేష్ గౌడ్, భూపతి లు గురువారం తెలిపారు. వీరు మన తెలంగాణ మహిళల సింగిల్స్ జట్టుకు ఎంపిక కావడం విశేషం. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ పి ఆర్ టి యు రాష్ట్ర పత్రిక సంపాదక వర్గ సభ్యులు పెంట జలంధర్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ లక్ష్మి నర్సయ్య, సీనియర్ ఉపాధ్యాయులు గంగ నరసయ్య భూమేశ్వర్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ అర్బన్ సెక్రెటరీ మల్లయ్య తదితరులు పాల్గొని అభినందించారు.