ఆర్చరీలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Selection for State Level Competitions in Archeryనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామానికి చెందిన దండు అనిల్ కుమారుడు అకుల్ అండర్ 14 ఆర్చరీ పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి అర్చరి పోటీలకు ఎంపికైనట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అకుల్ ను రాష్ట్రస్థాయి పోటీల ఎంపికవడం పట్ల పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.