రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

నవతెలంగాణ కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఆంధ్రయ్య మంగళవారం తెలిపారు. గాంధారి మండలం పేట సంఘం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన 68వ ఎస్ జిఎఫ్ అండర్-14 ఉమ్మడి జిల్లాల వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎం.రఘురాం, అమర్ సింగ్ లు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.ఈనెల 16,17,18 తేదీలలో మెదక్ జిల్లా చేగుంటలో  జగనున్న రాష్ట్ర స్థాయి అండర్-14 వాలీబాల్  పోటీలలో విద్యార్థులు ఎం.రఘురాం, అమర్ సింగ్ లు పాల్గొంటారని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఎం.రఘురాం, అమర్ సింగ్ లను, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగేష్ ను ఎంఈఓ ఆంధ్రయ్య, ఉపాధ్యాయ బృందం సభ్యులు అభినందించారు.