మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బిముని రమ-రాజయ్య దంపతుల కుమార్తె బిముని స్రవంతి హార్టీకల్సర్ అధికారిగా ఉద్యోగానికి ఎంపికైనట్లుగా గ్రామస్తులు ఆదివారం తెలిపారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకొనున్నట్లుగా తెలిపారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ టిఎస్ఆర్, ఎస్, టిఆర్ జేసీ, కొండా లక్ష్మన్ బాపూజీ హార్టీ కల్సర్ యూనివర్శిటీలో చదివి ఉద్యోగానికి ఎంపిక కావడంపై గ్రామస్తులు స్రవంతిని అభినందించారు.