
మండలంలోని బషీరాబాద్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 19మంది విద్యార్థులు వివిధ గురుకులాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్ తెలిపారు. 2024-25 విద్య సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశానికి గాను ప్రభుత్వ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా 19 మంది విద్యార్థులు వివిధ గురుకులాలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఒకేసారి పాఠశాలలకు చెందిన 19 మంది వివిధ గురుకులాలకు ఎంపిక ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివిధ గురుకులాలకు ఎంపికైన 19 మంది విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.