జాబ్ మేళాలో 8 మంది విద్యార్థుల ఎంపిక..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ల ఆదేశానుసారం యూనివర్సిటీ లో పీ.జీ. ఫైనల్ ఇయర్ చదువుతున్న  విద్యార్థులకు తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ అకాడమీ ఆఫ్  స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థలు సంయుక్తంగా డి. ఎస్. టెక్నాలజీస్ కంపెనీలో గల టెక్నికల్ రిక్రూటర్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూట్, డిజిటల్ మార్కెటింగ్  ఖాళీల భర్తీకి డి ఎస్ టెక్నాలజీస్ వారిచే నిర్వహించిన క్యాంపస్ ప్లెస్  మెంట్ డ్రైవ్ లో 58 మంది రిజిస్టర్ చేసుకోగా వ్యక్తిగత పరిచయ రౌండ్ గ్రూప్ డిస్కషన్, ముఖాముఖి పరిక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థులు వివిధ పోస్ట్ లకు ఎంపికయ్యారు. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు యూనివర్సిటీ కి రానున్నాయని  విద్యార్థులు సిద్ధం కావాలని  ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజేష్, అసిస్టెంట్ మేనేజర్ యు. సత్యనారాయణ, మిస్ వర్షిని  హెచ్ ఆర్, గఫార్, టీం లీడ్ ప్రొఫెసర్   రాంబాబు గోపిశెట్టి, డాక్టర్ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైనా విద్యార్థులకు  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యం. యాదగిరి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరతి,  ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పాతా నాగరాజు అభినందనలు తెలిపారు.