గ్రామసభల ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక..

Selection of beneficiaries with the approval of Gram Sabhas..– భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామసభల ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల అర్హుల జాబితాలపై శుక్రవారం మండలంలోని రుద్రారం గ్రామసభను పరిశీలించి మాట్లాడారు. అధికారులు నాలుగు పథకాల అర్హుల జాబితాలను గ్రామసభల్లో వినిపించిన క్రమంలో అందులో ఎలాంటి అభ్యంత రాలు వచ్చినా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.నాలుగు పథకాలకు సంబంధించి సిద్ధం చేసిన అర్హుల జాబితాలో పేర్లు లేని అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే తిరిగి మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఇచ్చినా గ్రామసభల్లో తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలతో దరఖాస్తులు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత పథకం అర్హుల జాబితాను గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదిం చినట్లు ప్రకటిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, తాజా మాజీ వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య,సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గేం రమేష్,కార్యదర్శి సాయి చరణ్,రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.