జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు బిట్స్ విద్యార్థుల ఎంపిక

Selection of BITS students for district level sports festivalsనవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలో బుధవారం రోజున ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో SGFI మండల స్థాయి క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడల్లో  బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు అండర్ 14- అండర్ 17 విభాగంలో కబడ్డీ, ఖోఖో క్రీడలలో పాల్గొని 11 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిండి యుగేందర్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులకు బిట్స్ పాఠశాల చైర్మన్  డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. క్రీడల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం, మానసిక శారీరక ఉద్దీపనలను అందిస్తాయని, ఆటలు విద్యాపరమైన అనుకరణ లేదా మానసిక పాత్రను నిర్వహించడానికి తోడ్పడతాయని తెలియజేశారు.