పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల్లో పలు సబ్జెక్టులకు అభ్యర్థుల ఎంపిక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి పలు సబ్జెక్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, లెటర్‌ ప్రెస్‌ లెక్చరర్‌ (ప్రింటింగ్‌ టెక్నాలజీ), ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ ఏడో తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.