నవతెలంగాణ-ఉట్నూర్
సౌత్ జోన్ ఇంటర్ కళాశాల ఫూట్ బాల్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ టి.ప్రతాప్‌సింగ్, పీడీ అనిత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 29, 30, మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రంలో ఇంటర్ కళాశాల ఫూట్‌బాల్ టోర్నమెంట్ జరిగిందనీ, దీనికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో మూడో సంవత్సరానికి చెందిన విద్యార్థి కొట్నాక్ సచిన్ అత్యంత ప్రతిభ కనబర్చడంతో సౌత్ జోన్ ఇంటర్ కాలేజీ ఎట్ ఫూట్‌బాల్ టోర్నమెంట్‌కి ఎంపికయ్యాడని తెలిపారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినిని అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ నర్సింగ్ రావు, అధ్యాపకులు ఉన్నారు.