రాష్ట్రా స్థాయి సెపక్ తక్రా టోర్నికి జిల్లా జట్ల ఎంపిక

నవతెలంగాణ – మోపాల్ 

గురువారం మోపాల్ మండలంలోని ప్రెసిడెన్సీ పాఠశాల లో సేపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో  సబ్ జూనియర్ మరియు జూనియర్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల  నుండి 46 మంది క్రీడాకారులు ఎంపికలలో పాల్గొనడం జరిగింది. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను  ఎంపిక చేసి జిల్లా జట్టను ఖరారు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 24,25 తేదీలలో నల్గొండ లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని  తెలిపారు. ఎంపిక సందర్భంగా ప్రెసిడెన్సీ పాఠశాల ప్రిన్సిపల్  పవన్ కుమార్  ఎంపికైన క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడుతూ టోర్నమెంట్ లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టును  విజయపథంలో నడపాలని, అలాగే టోర్నమెంట్ లో క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని, విజయంతో తిరిగి రావాలని సూచించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు దీపిక, కార్యనిర్హణ కార్యదర్శి చామకూర బాగారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు  శ్రీనివాస్, లక్ష్మణ్, సరళ, సంఘ బాధ్యులు సయ్యద్ నబీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు జూనియర్ బాలుర విభాగంలో  ఉదయ్ కుమార్,  హనోక్, రాహుల్, జైల్ సింగ్, నెహ్రు బాలిక విభాగంలో రిక్కిరెడ్డి, శ్రీజ, శ్రేష్ట, లాస్య ప్రియ, అక్షర, లాస్య శ్రీ రిషిత సబ్ జూనియర్ బాలుర  విభాగంలో భవిక్, ప్రణయ్ వంశీ, మిథున్ తేజ, సాత్విక్, అర్జున్ బాలికల విభాగంలో వర్షిని, యోగేశ్వరి, మన్విత, మన్వి, భవ్య శ్రీ రెడ్డి ఎంపికయ్యారు. జట్ల కోచ్, మేనేజర్లుగా గాదరి  సంజీవరెడ్డి, ఎల్. శ్రీనివాస్, సరళ, కళ్యాణ్ వ్యవరిస్తారు.