రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక 

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నదని ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి తెలిపారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే కు విద్యార్థులు ఈనెల 9 తేదీన తూప్రాన్ లోని  ఆర్నాల్డ్ స్కూల్లో జరిగిన  ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ జూనియర్ ఖోఖో సెలెక్షన్ లో సుమారు 150 మంది విద్యార్థులు క్రీడాకారులు పాల్గొనగా అందులో హాబ్సిపూర్ మహాత్మ జ్యోతిబా పూలే  గురుకుల పాఠశాలకు చెందిన  ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు రాహుల్ , నంద కిశోర్ & సంజయ్ లు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక అవడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి తెలిపారు .వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు,  ఇతర ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు.  సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులోని మౌలాలిలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలో పాల్గొంటారని పీఈటీ తరుణ్ రాజ్ తెలిపారు.