నవతెలంగాణ- కంటేశ్వర్
ఈ నెల (20-01-2024) తేదీన ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెంజల్ నందు ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల టోర్నమెంట్ కామ్ సెలక్షన్ నిర్వహించబడుతుంది అని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం, నిజామాబాద్ అధ్యక్షులు మానస గణేష్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు ఉమ్మడి నిజామాబాద్ (కామారెడ్డి, నిజామాబాద్) జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చు అని తెలియజేశారు.ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 02.01.2004 తేదీ తర్వాత పుట్టిన వారు అర్హులు. ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెలలో జరిగే 68వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర మరియు బాలికల బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు తీసుకొని రాగలరు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తికి రిపోర్టు చేయగలరు అని తెలియజేశారు.