స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలకు సెలక్షన్స్..

నవతెలంగాణ – వేములవాడ రూరల్ : తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలకు కొరకు మంగళవారం వేములవాడ అర్బన్, రూరల్ మండల స్థాయిలో సెలక్షన్స్ నాంపల్లిలోని నిర్మల హైస్కూల్లో నిర్వహించారు. ఈ సెలక్షన్లో 40 మంది విద్యార్థిని, విద్యార్థులు నాలుగో తరగతి ప్రవేశాల కొరకు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొన్నారు. ఇందులో సెలక్షన్ అయిన వారు జిల్లా స్థాయిలో పోటీలలో పాల్గొనడం జరుగుతుందని పిడి రవీందర్ రావు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాస్, రమేష్, జ్యోతి, శేఖర్, సాయి తో పాటు తదితరులు పాల్గొన్నారు.