
తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల పురుషులు, మహిళల క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ 2024 ను వర్సిటీ క్రీడామైదానం లో నిర్వహించమని డైరెక్టర్ డాక్టర్ జి. బాలకిషన్ శనివారం తెలిపారు.ఈ ఛాంపియన్షిప్ కు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలనుండి వివిధ డిగ్రీ కళాశాలల అతిలేట్స్ సుమారు 40 మంది పాల్గొన్నారు.ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ 2024 మహారాష్ట్ర లోని నాందేడ్ శ్రీ రామానంద తీర్థ మరట్వాడ యూనివర్సిటీ లో ఫిబ్రవరి 10,11 తేదీలలో నిర్వహిస్తారు.ఇందులో మొదటి ఆరు స్థానాల అత్లెట్స్ తెలంగాణ వర్సిటీ తరుపున పాల్గొంటారని తెలిపారు.తెలంగాణ యూనివర్సిటీ లో ఛాంపియన్షిప్ ఎంపిక నిర్వహించడానికి అనుమతి ఇచ్చి క్రీడాలను ప్రోత్సాహస్తున్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్. ఎం. యాదగిరి కి డైరెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎంపికైన అతిలెట్స్ : పురుషుల విభాగంలో
కె. అనిల్ (టిటిడిలో అర్ డి సి కామారెడ్డి),డి. జ్ఞానేశ్వర్ ( జిజిసి),
జె. బందు నాయక్ (జిజిసి ),కె. నాగరాజు (టిటిడిలో అర్ డి సి కామారెడ్డి),ఎన్. వెంకుల్ (జిజిసి ),
కె. వినోద్ (జిజిసి)
మహిళల విభాగంలో బి. హరిత (జి.డి.సి కామారెడ్డి), ఎం. అకిత (జిడిసి కామారెడ్డి),జి. మౌనిక జిజిసి,
జి. రోజా టిఎస్ డ్లు అర్ డి సి నిజామాబాద్, జె. శ్రీ వర్ష జిజిసి,
ఎస్. దీక్ష టిఎస్ డ్లు అర్ డి సి నిజామాబాద్ ఉన్నారు.ఈ ఛాంపియన్షిప్ కార్య నిర్వాహకులుగా డా. బి. ఆర్. నేత కన్వీనర్ గా డా.జి బాలకిషన్ వ్యవహరించగా, వివిధ కళాశాలల ఫీజికల్ డైరెక్టర్స్ బాలమణి,అనిల్, ప్రవీణ్, రాజేందర్ మరియు జూనియర్ అసిస్టెంట్ నరేష్, మల్లికార్జున్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.