స్వయం ఉపాధి మార్గాలు భవితకు సోపాలు 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

ఉద్యోగాల కన్నా స్వయం ఉపాధి మార్గాలు తృప్తినిస్తాయని, ఉన్నత స్థానాలకు చేరుస్తాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్  విజయ గిరి బిక్షపతి అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని పాల శీతలీ కరణ కేంద్రాన్ని డెవలప్మెంట్ విభాగం విద్యార్థులచే క్షేత్ర సందర్శన చేశారు. వివిధ గ్రామాల నుండి పాలు సేకరించే విధానాన్ని, వాటిని పరిశీలించి కాపాడే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జీవి రాజిరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ ఏలూరి కోవల కోఆర్డినేటర్ రేణుక అధ్యాపకులు కే రాజ్యలక్ష్మి , ఎం జోష్ణ  పి సుమలత వి శ్రీనివాస్, చుక్క రమేష్ నవీన్ సదానందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.