నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని చలకుర్తి జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం శనివారంఘనంగా నిర్వహించారు. పరిపాలన దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ గా బ్రాహమ్మని, జాయింట్ కలెక్టర్ లిఖిత ఎంపీడిఓ గా శిరీష, జిల్లా విద్యాశాఖ అధికారిగా రుత్విక్, డిప్యూటీ డిఈఓ గా కృష్ణ వేణి, ఎంఈఓగా ఉష, ప్రదానోపాధ్యాయులుగా అనూష,వివిధ పోస్టులలో హోదాల్లో క్రమశిక్షణతో చాలా హుందాగా వ్యవహరించిన తీరు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యోగాలు సంపాదించి ప్రజలకు సేవ చేయాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇష్టంతో కష్టమైన సరే భవిష్యత్తులో వివిధ రంగాలలో విద్యార్థులు ఎదిగి ఉన్నంత పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఝార్జీ, సైదా నాయక్, శ్యామ్ బాబు, నారాయణ రెడ్డి, శాబుద్దీన్, రేణుక, జెస్సిక, ఉమామహేశ్వరీ, సహదేవి, శాంత తదితరులు పాల్గొన్నారు.