స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవం

– ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు
నవతెలంగాణ – చండూరు
విద్యార్థులకు స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవంను నిర్వహించినట్లు స్థానిక గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శనివారం  గాంధీజీ విద్యాసంస్థలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒక్కరోజు పాలనలో విద్యార్థులు నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా, ఉపాధ్యాయులుగా తమ పాత్రలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు కలెక్టర్, డీఈవో, ఎంఈఓ లుగా పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ విద్యార్థులను ఎంతగానో ఆకర్షించారు. స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ స్వపరిపాలన దినోత్సవం లో సీఎంగా మణిదీప్, ఉపముఖ్యమంత్రిగా గణేష్, విద్యాశాఖ మంత్రిగా అలకనంద, మంత్రులుగా జ్ఞానేశ్వర్, ఓం ప్రకాష్, శివప్రియ, అక్షిత, దివ్య, ప్రతిపక్ష నాయకులుగా వంశీ, ప్రదీప్, అజయ్, ఎమ్మెల్యేలుగా హరీష్, శివాని, దీపిక, కలెక్టర్‌గా నేహశ్రీ, జాయింట్ కలెక్టర్‌గా శివాని ,ఆర్డీఓ గా కావ్య, మున్సిపల్ చైర్మన్‌గా  అమూల్య, డీఈవోగా భార్గవి, కారస్పాండెంటుగా శృతి, హెచ్ఎం గా పూజ వైష్ణవి, డైరెక్టర్స్ గా రేణుక, హన్సిక, దీక్షిత తమ తమ పాత్రలను పోషించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.