
అక్బర్ పేట భూంపల్లి మండలంలోని జడ్పిహెచ్ఎస్ భూంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధించారు. డీఈవోగా శ్రీవర్ష, ఎంఈవోగా సాయి ప్రియ, హెచ్‌ఎంగా రేశ్వంత్, పీఈటీగా హారిక వ్యవహరించగా, పలువురు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజేందర్ ఉపాధ్యాయులు రాచకొండ భూపాల్, దయాసాగర్ ,శ్రీనివాస్, రవిశేఖర్, భాగ్యమ్మ,పద్మావతి, ప్రకాష్ ,వినయ్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.