
స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. శనివారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం స్వపరి పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతు పాఠశాలలు చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర వహించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాటలు బోధించడం జరిగిందన్నారు. డిఈఓ అజయ్,ఎంఈఓ రజిత, ప్రధానోపాధ్యాయురాలు కార్తీక్, మిగతా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా వారి వారి పాత్ర నిర్వహించారు. దీనివల్ల నిజ జీవితంలో కూడా సమాజంలో ఏ విధంగా ఉండాలనే విషయంలో స్వీయ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందని తెలిపారు. విద్యార్థులు అందరూ వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులకు వారి పై చదువులకు తొలిమెట్టుగా భావించి కష్టపడి చదివి పాఠశాలకు మరియు వారి తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చే విధంగా అందరు ఉత్తీర్ణులు కావాలని పాఠశాల పేరు చిరస్థాయిగా నిలపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,తులసీదాస్, మెట్టరామ్, నాగరాజు, నర్సింగరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.