ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రం బాలుర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గా గౌతమ్, డి.ఈ.వో గా కిరణ్, యం.ఈ.వో గా అక్షయ్, కాంప్లెక్స్ హెచ్.ఎం గా మురళి, హెచ్.ఎం గా వరలక్ష్మి లు, ఛాత్రోపాధ్యాయులు గా 22 మంది విద్యార్థులు వ్యవహరించి విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. గురువులు వాళ్ళు ఎంతో ఓపికతో మాకు విద్యను అందిస్తున్నారో అర్థం అయ్యిందని, ఉపాధ్యాయులు చెప్పే విషయాలు పాటించి, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటామని వారి లక్ష్యాలను తెలియజేశారు. ముఖ్య అతిథితులుగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి రామారావు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే, మీ పైన మీకు నమ్మకం ఉంచుకుని బాగా చదువుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, బాలమణి, వెంకటేష్, పద్మావతి, సమీప పాఠశాల ఉపాధ్యాయులు కరుణాకర్, జానకిరాం లు పాల్గొన్నారు.