ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవము శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్య క్రమంలో 39 మంది ఛాత్రోపాధ్యాయులుగా వ్యవహరించి తమతమ పాత్రలకు తగున్యాయం చేశారు . ఛాత్ర ప్రధానో పాధ్యాయురాలి గా సమీర 10th E/M వ్యవహరించినారు. ఛాత్ర విద్యాశాఖ మంత్రిగా రవితేజ, RJDగా అఖిల, కలెక్టర్ గా పూజ, DEOగా శ్రావణి, Dy. Eoగా యశ్వంత్, MEO గా సంగీత వ్యవహరించారు. ఛాత్రోపాధ్యాయులుగా మంచి నైపుణ్యం ప్రదర్శించిన రహీమ్, నందిని, సంజన, యోగేందర్,  నరేశ్, భాను ప్రసాద్ ,పూజ, అఖిలలు సబ్జెక్టు వారీగా బహుమతులు గెలుచుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుని పాత్ర క్లిష్టమైనదని, సమాజాభివృద్ధికి కీలకమని, నేటి విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని తెలుసుకుంటారని ఆకాంక్షించారు.
గెలుపొందిన ఛాత్రోపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాస రెడ్డి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ హనుమంత్ రెడ్డి, లక్ష్మారావు, శ్రీనివాసమూర్తి, అనురాధ, అనసూయ, సత్యనారాయణ, సతీష్, చంద్రశేఖర్, కల్పన, శ్యాంసుందర్ గౌడ్, అజ్మతుల్లా, కమలేకర్ నాగేశ్వరరావు, పర్వతాలు, అనిత, శ్రీలత, అజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.