ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 23 మంది ఛాత్రో పాధ్యాయులుగా వ్యవహరించారు వీరిలో జిల్లా విద్యాశాఖ అధికారిగా సుమతి,మండల విద్యాధికారిగా గాయత్రి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా పూజ, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా భరత్ వ్యవహరించారు. చిన్నారులు చక్కటి  వేషాధారణతో పాఠశాలను ఒక పండుగ వాతావరణం కల్పించి, వారి బోధన కౌశల్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పునుంతల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థులను అభినందిస్తూ, జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా కష్టపడి చదివి  మంచి ఉద్యోగం సాధించి ఉన్నతంగా ఎదిగి చదువుకున్న పాఠశాల ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, రామచంద్రారెడ్డి,శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.