దత్తప్పగూడెం ప్రాథమిక పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ డే..

నవతెలంగాణ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సెల్ఫ్ గవర్నమెంట్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. అనంతరం ఆటలు, పాటలతో విద్యార్ధులు ఆడిపాడారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.