ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రతి ఒక్కరు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని,క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకొని,భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని తుంగతుర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెలుగు రమేష్ అన్నారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒక్కరోజు పాలనలో విద్యార్థులు నాయకులుగా ప్రజాప్రతినిధులుగా అధికారులుగా ఉపాధ్యాయులుగా తమ పాత్రలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధన చేసిన విధానం పలువురిని ఆకట్టుకుంది.విద్యార్థులకు స్వయంగా అనుభవం కోసమే,ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం పెంచడం కోసమే స్వపరిపాలన దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ స్వపరిపాలన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ గా పి అజిత్,జిల్లా విద్యాశాఖ అధికారిగా కటకం రిషి చరణ్,మండల విద్యాశాఖ అధికారిగా వినయ్ కుమార్,ప్రధానోపాధ్యాయులుగా ధనుష్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా అర్జున్ లు  వ్యవహరించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉపదేశ,వసుంధర,శ్రీలత విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.