ఎం.పీ.పీ .ఎస్ పాలెం లో స్వపరిపాలన దినోత్సవం

నవతెలంగాణ-హలియా : ఎం.పీ.పీ .ఎస్ పాలెం లో స్వపరిపాలన దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలలోని విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత విద్యాధికారులుగా, ఉపాధ్యాయులు గా వేషధారణలో చాలా అలరించారు. వారు ఒక్క రోజే ఉపాధ్యాయ వృత్తి  యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు తరగతి గదిలో ఎలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారో తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గా తెలకపల్లి హిమబిందు, మండల విద్యాధికారిగా బతుల రూపిని, హెడ్మాస్టర్ గా   గా గుండెబోయిన గణేష్ వ్యవహరించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మద్దెల ప్రసాద్ గారు మాట్లాడుతూ,  మీరు ఇంకా ముందు, ముందు మంచిగా చదువుకొని మంచి  ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడాలని, కేవలం ఉద్యోగమే కాదు, సంఘ సేవ కూడా చేయడం అలవర్చుకోవాలని, మిమ్ములను ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల ను కూడా మంచిగా చూసుకోవాలని కోరినారు. సమాజంలో మంచి వ్యక్తులుగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ కన్నెబోయిన వెంకన్న గారు, శ్రీ సోమ గాని శ్రీనివాస్ గారు ,విద్యా వాలంటీర్ నాగమణి మహేష్ గారు, ఎస్.ఎం.సి మాజీ చైర్మన్ కోటేష్ గారు అంగన్వాడీ టీచర్ కే. జయమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.