మిసిని ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చిన్న తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయులుగా పోతు మణివర్దన్, పీఈటీగా నందకిశోర్, ఉపాధ్యాయులుగా పావని, మణి వర్ధన్, అనుష్క, తంగి శ్రీ,అనన్య, భవిత, సానియా, రుషిక, మూర్తుజ, రష్మిక, అక్షయ, అల్ఫియా, ప్రగ్య వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బాలే రవీందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.