రేపటివరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న తొ లివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సీట్లు పొందిన అభ్యర్థులు సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేసే గడువును ఆదివారం వరకు ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ శుక్రవారమొక ప్రకట న విడుదల చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌తోపాటు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ చెల్లింపు గడువును ఆదివారం వరకు పొడిగించామని తెలి పారు. అయితే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తొలివిడతలో 173 కాలేజీల్లో 82,666 సీట్లుంటే, 70,665 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించిన సంగతి విదితమే.