సేనాపతి విశ్వరూపం

సేనాపతి విశ్వరూపంకమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు రెడ్‌ జెయింట్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘భారతీయుడు 2’. జీరో టాలరెన్స్‌ ట్యాగ్‌ లైన్‌. ఈ మూవీ తెలుగు థియేట్రికల్‌ హక్కులను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి, సీడెడ్‌ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్‌ లెవల్లో రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్‌ ప్రమోషనల్‌ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు..
సేనాపతిగా కమల్‌హాసన్‌ తనొక ఫ్రీడమ్‌ ఫైటర్‌గా తన గురించి చెబుతూ ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే పవర్‌ఫుల్‌, ఎమోషనల్‌ డైలాగ్స్‌ ‘భారతీయుడు 2’ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్‌లో సేనాపతి పాత్రలో కమల్‌ హాసన్‌ యాక్షన్‌ సన్నివేశాలు, వాటిని అత్యద్భుతంగా తెరకెక్కించిన శంకర్‌ మేకింగ్‌ స్టైల్‌ నెక్ట్స్‌ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని ట్రైలర్‌ రేకెత్తిస్తోంది. ఈ ట్రైలర్‌లో సేనాపతి పాత్రతో పాటు డిఫరెంట్‌ లుక్స్‌లో కమల్‌ హాసన్‌ తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ఇక మర్మకళతో విలన్స్‌ భరతం పట్టడాన్ని కూడా ఈ సినిమాలో మరింత విస్తతంగా చూపించినట్లు స్పష్టమవుతుంది. రవివర్మన్‌ సినిమాటోగ్రఫీ, అనిరుద్‌ సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవల్‌లో ఆవిష్కరించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్‌ హాసన్‌ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ ట్రైలర్‌ చూస్తుంటేనే అర్థమవుతోందని చిత్ర యూనిట్‌ తెలిపింది.