భారతీయ సినీ రంగంలో కమల్ హాసన్ తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకుల హదయాల్లో చెరగని ముద్ర వేశారు. డైరెక్టర్ శంకర్ గురించి చెప్పాలంటే కమర్షియల్‌గా భారీ చిత్రాలను అద్భుతం అని అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించటంలో సుప్రసిద్ధుడు. ఆయన సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్దరూ చేతులు కలిపారంటే అద్భుతమైన సినిమా మన ముందుకు వస్తుందనటంలో సందేహం లేదు. భారతీయుడు (ఇండియన్) సినిమాతో అది నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘భారతీయుడు 2’తో సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేయబోతున్నారు. ‘భారతీయుడు’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆతతగా ఎదురుచూస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపతిగా ‘భారతీయుడు’ చిత్రంతో కమల్ హాసన్ తిరుగులేని విజయాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుండటంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. గ్రిప్పింగ్ కథనంతో ఈ మూవీ మరింతగా ప్రేక్షకులను మెప్పించనుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు సహా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసిన శంకర్ ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేయటంపై దష్టి సారించారు. మే నెలాఖరున పవర్‌ప్యాక్డ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ‘జీరో టాలరెన్స్’ లైన్ ఈ అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్‌గా వర్క్ చేస్తున్నారు.