పార్లమెంట్ కు  జహంగీర్ ను ఆశీర్వదించి పంపండి 

నవతెలంగాణ – చండూర్  
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో  సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి ఎండి. జహంగీర్ ను ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో, ప్రశ్నించే గొంతును, పార్లమెంటుకు పంపాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి  మొగుదాల వెంకటేశం గౌడ్   ఓటర్లను కోరారు. బుధవారం చండూర్ మున్సిపల్ పట్టణములో పలు వీధుల్లో తిరుగుతూ ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చట్టసభల్లో వామపక్ష అభ్యర్థులు లేకపోతే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. విద్యార్థి దశ నుండి ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల పక్షాననిస్వార్ధంగా నిలిచి, అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేసి,  ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి పోరాడే వారని అన్నారు. సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి, ఎస్ ఎల్ బీసీ, ఉదయ సముద్రం, బస్వపురం, గంధ మల్ల దేవాదుల, ప్రాజెక్టులు పూర్తి చేయాలని, విద్య, వైద్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆయనకు, సీపీఐ(ఎం) కు ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో, భిన్న పార్టీల అభ్యర్థులు  పోటీ చేస్తున్నప్పటికీ, వారు స్వార్థ ప్రయోజనాల తప్ప, ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర లేదని, డబ్బులతో  ప్రజలను తప్పుతోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలనే, ప్రయత్నం చేస్తున్నారని  ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించి, ఐదేండ్లుమన భవిష్యత్తును నిర్ణయించే  ఓటును, ప్రజల మధ్యన ఉంటూ  ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి. జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు   చిట్టి మల్ల లింగయ్య,  కొండయ్య, యాదయ్య  తదితరులు పాల్గొన్నారు.